ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలి.. సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu) ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada) లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నాను. దీనికన్నా ప్రధానమంత్రిని కోరి మన  రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టమనండి. దీనితో మీరు అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టవచ్చని నా బలమైన అభిప్రాయం అని తెలిపారు.

మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై దాడి ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మీలాంటి పాలన ఉంటుందా.. తిరుపతి లడ్డులో కల్తీ జరుగలేదని సీబిఐ వారు ఇచ్చిన రిపోర్టును కప్పిపుచ్చడానికి మీరు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక అబద్దం చెబితే ఆ అబద్దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్దాలు ఆడిన సరిపోదు. మీరు ఆడుతున్న అబద్దాల మూలంగా మీ పార్టీ నష్టపోతుంది.

మీరు ఎప్పుడూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నన్ను, ఇప్పుడు అంబటి గారిని అవమానించడం ఎంతవరకు సమంజసం.. గతంలో ఈ కులానికి, మీరు అధికారంలోకి రావడానికి బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే మొండి చేయి చూపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కులం మీ మీద ఎంత కోపంగా ఉన్నా డిప్యూటీ సీఏం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారిపై ఉన్న ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగింది. వారు మద్దతు ఇవ్వడంతోనే ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారనేది నిజం కాదా.. అయినా ఈ కులంపై రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి  వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే ప్రయత్నం చేయండి ముద్రగడ (Mudragada) తెలిపారు.

 Read Also: పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాలి : సీఎం చంద్ర‌బాబు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>