Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాలి : సీఎం చంద్ర‌బాబు

క‌లం, వెబ్ డెస్క్‌: అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు(CM Chandrababu) అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్ర‌హీంప‌ట్న‌లో మాజీ మంత్రి జోగి ర‌మేష్ (Jogi Ramesh) ఇంటిపై జరిగిన దాడిపై చంద్రబాబు సోమవారం ఆరా తీశారు. స్థానిక అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పలువురు టీడీపీ (TDP) నేతలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాజ‌కీయ పార్టీలు రాజ్యాంగ బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఉద్రిక్త‌ల‌కు దారితీసే చ‌ర్య‌ల‌ను స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో రాజీప‌డేది లేద‌న్నారు. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా అంద‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

 Read Also: రాష్ట్రంలో వైసీపీని బ‌హిష్క‌రించాలి : గంటా శ్రీనివాస రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>