కలం, వెబ్ డెస్క్: హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నం సోమవారం ఉదయం హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గంలో పర్యటించారు. ఇంటింటా తిరిగి కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హుస్నాబాద్‌లో 20 మున్సిపల్ వార్డులు ఉన్నాయని, ప్రతి చోటా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని మంత్రి తెలిపారు. అందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటికే హుస్నాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుందని, ఉపాధి పెరిగితే అందరి భవిష్యత్తు బాగుంటుందని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ అభివృద్ధిని ఆశించే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు.


