epaper
Monday, February 2, 2026
spot_img
epaper

రెండు పార్టులుగా వారణాసి..?

కలం, వెబ్ డెస్క్​ : సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తన రూటు మార్చి సైలెంట్ గా షూటింగ్ చేసేయడమే కాదు.. అప్ డేట్స్ కూడా సైలెంట్ గా ఎలాంటి ముందస్తు హంగామా లేకుండా ఇచ్చేస్తున్నాడు జక్కన్న. రిలీజ్ డేట్ సైలెంట్ గా ప్రకటించి మరోసారి సర్ ఫ్రైజ్ చేశారు. అయితే.. ఇప్పుడు వారణాసి ఒక పార్టా..? రెండు పార్టులా..? అనేది ఆసక్తిగా మారింది.

జక్కన్న ఈ సినిమాని (Varanasi) ఒక పార్టుగానే తీయాలి అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత దీని గురించి న్యూస్ రాలేదు. రాజమౌళి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని రెండు పార్టులుగా తీయాలి అనుకుంటున్నట్టుగా న్యూస్ లీకైంది. ఫస్ట్ పార్ట్ ను 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి.. సెకండ్ పార్ట్ నిజంగా ఉంటే.. దీని పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. దీని గురించి జక్కన్న ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏంటంటే.. 2029లో వారణాసి సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం వారణాసి షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జక్కన్న సంవత్సరం కంటే ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారంటే.. ఎంత ప్లానింగ్ లో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి.. చూడాలి వారణాసి రెండు పార్టులుగా రానుందని విషయం పై క్లారిటీ ఇస్తారో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>