Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌కు చేరుకోనున్న ధోనీ.. ఐపీఎల్ ఫైట్‌కు గెట్ రెడీ!

కలం, వెబ్ డెస్క్​: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో రసవత్తర పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం సీఎస్కే స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) త్వరలోనే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సీజన్ ప్రారంభం నుంచి మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన ధోనీ, ఈ మ్యాచ్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్న ఆయన రాకతో చెన్నై ఆటగాళ్లలో ఉత్సాహం నెలకొంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోనీ (MS Dhoni) రీఎంట్రీ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆడిన ఐదు మ్యాచ్‌లకు ధోనీ దూరమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగుతాడనే ప్రచారంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఒకవేళ హైదరాబాద్ మ్యాచ్‌లో ధోని ఆడకపోతే.. ఏప్రిల్ 23న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే హై-వోల్టేజ్ పోరులో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత ధోని క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ప్రత్యేకంగా ధోని ఆటను స్వయంగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Read Also: కోతిని తరుమబోయి సజీవ దహనం.. షాకింగ్ వీడియో

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>