కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో సంచలనం సృష్టించిన టీవీకే విజయ్ ‘జననాయగన్’ (Jana Nayagan) సినిమా లీక్ వ్యవహారంలో కీలక ఘటన చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు ఫ్రీలాన్స్ ఎడిటర్ కావడం గమనార్హం. ఎడిటింగ్ సమయంలోనే సినిమాను కాపీ చేసి బయటకి లీక్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. డిజిటల్ ఆధారాల సహాయంతో ఈ సినిమా డేటా చోరీకి పాల్పడిన ప్రధాన నిందితుడిని, అతడికి సహకరించిన మరో ఇద్దరిని ఏప్రిల్ 15న అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు ఒక ఎడిటింగ్ స్టూడియోలో ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సదరు వ్యక్తి ‘జననాయకన్’ (Jana Nayagan) సినిమా రీల్స్‌ను దొంగిలించి, వాటిని పూర్తి చిత్రంగా మార్చి ఇతరులకు పంపినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం వంటి పనులు చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: ఆపద్బాంధవుడు సాంగ్ రీ-క్రియేషన్.. 62 ఏళ్ల మీనాక్షి శేషాద్రి అద్భుతమైన డ్యాన్స్
Follow Us On: Instagram

