ఎంపీ రేణుకా చౌద‌రికి స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు

క‌లం, వెబ్ డెస్క్‌: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury)కి పార్లమెంట్‌లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 23లోగా ఆమె వివరణ ఇవ్వాలని కోరింది. గ‌త‌ శీతాకాల పార్లమెంటు సమావేశంలో రేణుకా చౌదరి కారులో కుక్కను తీసుకురావడంతో వివాదం త‌లెత్తింది. దీనిపై కొంద‌రు ఎంపీలు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. కుక్క క‌రుస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిపై రేణుకా చౌద‌రి స్పందిస్తూ లోపల కూర్చున్నవారే కరుస్తార‌ని, కుక్కలు కరవవ‌ని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ ఎంపీలు బ్రిజ్లాల్, ఇందు బాలగోస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో కుక్కను తీసుకురావడమే కాక, ఎంపీలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు రేణుకా చౌదరికి అధికారిక నోటీసు జారీ చేశారు.

Read Also: పక్కా ప్లానింగ్‌తో రామ్ చరణ్-సుకుమార్ మూవీ.. ఎందుకంటే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>