పక్కా ప్లానింగ్‌తో రామ్ చరణ్-సుకుమార్ మూవీ.. ఎందుకంటే!

కలం, వెబ్ డెస్క్: మేకింగ్‌లో ఇతర డైరెక్టర్లకు భిన్నంగా సుకుమార్ (Sukumar) సినిమాలను తెరకెక్కిస్తుంటాడు.  ఈ కారణంగానే కొన్ని సినిమాలకు చాలా సమయం తీసుకుంటాడనే పేరుంది. ముఖ్యంగా పుష్ప2 చిత్రం షూటింగ్ సమయంలో చిత్రబృందం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. సినిమా విడుదల తేదీ కూడా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఆయన తన పద్ధతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన తదుపరి సినిమాల విషయంలో ఇకపై ఎక్కవ సమయం తీసుకోకుండా, పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

రామ్ చరణ్‌ (Ram Charan)తో చేయబోయే ప్రాజెక్ట్‌ను కేవలం ఒకే ఏడాది పూర్తి చేయాలని సుకుమార్ (Sukumar) లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ ప్రారంభించిన ఏడాది లోపే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. గతంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సినిమా నిర్మాణంలో జాప్యం చేస్తారనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆయన తన పద్ధతిని మార్చుకుని వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ కూడా అదే బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>