కలం మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ (BJP) ప్రభుత్వ ఏర్పాటే ఏకైక మార్గమని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ (Eatala Rajendar) అన్నారు. బీజేపీ అధిష్టానం తర్వాత లక్ష్యం తెలంగాణ అని, రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 10వ తేదిన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తెలంగాణకు వచ్చి రూ.7 వేల కోట్లు అభివృద్ధి పనులను జాతి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సుమారు రూ.35 వేల కోట్లు రీజినల్ రింగు రోడ్డుకు కేంద్ర క్యాబినేట్ అమోదం తెలిపిన సందర్భంగా మోడీ సభను విజయవంతం చేయలన్నారు.
నిన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు కుటుంబ పాలన, అవినీతి, అహంకారానికి, రాష్ట్రానికి నేను ఓనర్‌ను అనే తరహా రాజకీయాలు చేసేవారికి .. ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పి చిత్తుగా ఓడించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కాపాడలేరని ఈటెల రాజేందర్ అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో మోడీ సభ సన్నాహక సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు.

