ఆసుపత్రి కూల్చివేతలపై డీకే అరుణ ఆగ్రహం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఎంబి మెడికల్ ఆసుపత్రి నివాస భవనాలను కూల్చివేయడంపై ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దివంగత డాక్టర్ అర్నాల్డ్ కుమార్తె, వైద్యురాలు డాక్టర్ అనురాధ నివాసం, ఆసుపత్రి ప్రాంగణంలో అర్ధరాత్రి వేళ బుల్డోజర్లు చొరబడటం దారుణమన్నారు. మహిళా వైద్యురాలిపై అధికార బలం ప్రయోగించి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం సరికాదన్నారు.

కోర్టును తప్పుదోవ పట్టించి, చట్ట విరుద్ధంగా ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన గురవుతోందని ఎంపీ డీకే అరుణ వివరించారు. డాక్టర్ అనురాధ, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. అర్ధరాత్రి పూట భయాందోళనలకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>