కలం, నిజామాబాద్ బ్యూరో : మొదటి విడత జనగణన సందర్భంగా నిజామాబాద్ లోని కార్యాలయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) స్వీయ నమోదు చేసుకున్నారు. నిజామాబాద్ ఎమ్మార్వో బాలరాజు ఆధ్వర్యంలో సిబ్బంది కూడా ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయంలో ఉన్నారు. ఏప్రిల్ 26 నుంచి మొదటి విడత జన గణన మొదలైందని అధికారులు 11 మే నుంచి ఇళ్లకు వస్తారని వారికి సహకరించాలని అరవింద్ కోరారు. ప్రజలందరూ స్వీయ గణన పోర్టల్‌ను వినియోగించి జనగణనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.. జన గణన లో వివరాలు నమోదు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పుకొచ్చారు.

