Mobile Popup Ad
Mobile Popup Ad

కులరహిత సమాజం కోసం పోరాడుదాం: తిప్పారపు సురేష్

కలం, కరీంనగర్ బ్యూరో: పూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానం కేంద్రంలో కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కరీంనగర్ లోని మంకమ్మతోట కార్యాలయం ముందు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ (Tipparapu Suresh) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలన్నారు. కుల అసమానతలు, సమాజంలోని వివక్ష వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. నేటికి కుల వివక్ష అంటరాని తనం, వెలివేతలు, దళితుల గ్రామ బహిష్కరణలు కొనసాగుతున్నాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. సురేష్ తో పాటు కేవీపీఎస్ నాయకులు పులిపాక సాయి కుమార్, గాజుల కనకరాజ్, భూతం మల్లేష్, ప్రగ్నేష్ కుమార్ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>