Mobile Popup Ad
Mobile Popup Ad

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ ముందుకు ఎంపీ చామల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగవంతం చేసింది. జూన్ నెలలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ సమర్పించనున్న నేపథ్యంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోన్ ట్యాప్ అయిన బాధితులను ఒకరి తరువాత మరొకరిని పిలిచి అధికారులు ఆధారాలు, వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో నేడు సిట్ ముందుకు కాంగ్రెస్ నేత, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) హాజరు కానున్నారు. చామల ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్ కు ఇవాళ ఉదయం 11 గంటలకు రావాలని ఎంపీ చామలకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

అటు గురువారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నాయకుడు లంకల దీపక్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారించారు. ఈ మేరకు వారి వద్దనుంచి వాంగ్మూలాలను సేకరించారు. విచారణ అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని అన్నారు. అన్ని పార్టీల వారితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ అయినట్లు సిట్‌ అధికారులు చెప్పలేదని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం పిలిపించినట్లు తనకు అర్థమైందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>