తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎంపీ చామల ఫైర్

కలం, నల్లగొండ బ్యూరో: పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ (BJP) ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని ‘మకర్ ద్వార్’ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1600 మంది అమరవీరులను తేజస్వి సూర్య తన వ్యాఖ్యలతో అవమానించారని, అసలు తెలంగాణ చరిత్రపై ఆయనకు ఏమాత్రం అవగాహన ఉందని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు తేజస్వి సూర్య (Tejasvi Surya) తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డగా ఉండి కూడా తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమర్థించడం సిగ్గుచేటని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కోల్పోయి, బీజేపీకి అవయవదానం చేసి 8 సీట్లు కట్టబెట్టిందని ఎద్దేవా చేశారు. తమను లోక్ సభకు రానివ్వకుండా చేసింది తెలంగాణ ప్రజలేనన్న విషయాన్ని బీఆర్ఎస్ గుర్తుంచుకోవాలని, బీజేపీని గెలిపించి బీఆర్ఎస్ పెద్ద తప్పు చేసిందని చామల విమర్శించారు. తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని, పార్లమెంట్ లోపల, వెలుపల తమ పోరాటం కొనసాగుతుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) స్పష్టం చేశారు.

Read Also: అణచివేత నుంచి అధికారం వైపు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>