కరీంనగర్ బీజేవైఎంకు కొత్త సారథి

కలం, కరీంనగర్: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) కరీంనగర్ (Karimnagar) జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి పట్టణానికి చెందిన  సంగ నరేష్‌ను (Sanga Naresh) నియమిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంగ నరేష్ మాట్లాడుతూ, జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేయడంతో పాటు యువతలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వాములను చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్‌తో పాటు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకత్వానికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంగ నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>