బండి సంజయ్‌కు ఎంపీ చామల కౌంటర్

కలం, వెబ్ డెస్క్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) కౌంటర్ విసిరారు. 10న తెలంగాణలో మోదీ పర్యటన ఉందని.. అంతకంటే ముందే తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ మొదలుపెట్టి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. కేరళ వెళ్లి సీఎం రేవంత్ ఏం చేశారనే దానిపై బండి సంజయ్ తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డిపై కోపం ఉన్నా.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాపులారిటీ అవడం మీకు నచ్చకున్నా మాకు ఇబ్బంది ఏం లేదన్నారు.

రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజరా కాదా అనే విషయం బండి సంజయ్‌కే బాగా తెలియాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటే బండి సంజయ్ చేయలేని పని రేవంత్ రెడ్డి చేసి చూపించారని చామల (MP Chamala) కొనియాడారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా బిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో గద్దె దించారని.. గేమ్ ఛేంజర్ అంటే ఇదీ అంటూ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్‌గా కేరళలో (Kerala) మాత్రమే ప్రచారం చేశారని.. మిగిలిన అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు వెళ్లలేదన్నారు. గతేడాది సెప్టెంబర్ 1 బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం (Kaleshwaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ఇప్పటివరకు సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదు బండి సంజయ్? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తే 48 గంటల్లో తాడోపేడో తేలుస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఏమైంది? అంటూ మండిపడ్డారు. 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఉందని.. అంతకంటే ముందే తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ మొదలుపెట్టి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచించారు.

Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏఐసీసీ నాయకులతో చర్చ

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>