Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

కలం, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టు(AP High Court)కు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకు జడ్జిలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఇటీవల సమావేశమైన కొలీజియం, ఏపీకి ముగ్గురు న్యాయమూర్తులను సిఫారసు చేసింది.

రాష్ట్రంలోని భిన్న కోర్టుల్లో న్యాయాధికారులుగా సేవలందిస్తున్న గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతపూడి పురుషోత్తమ్‌ కుమార్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.

ఇప్పుడు ఈ సిఫారసులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. ఆమోదం లభించిన అనంతరం వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read Also: ఆర్సీబీ జట్టులో కీలక పరిణామం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>