సీఎం రేవంత్‌పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

కలం, నిజామాబాద్ బ్యూరో : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని ఆరోపించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అరవింద్.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు మొండిచేయి చూపుతున్నారని విమర్శించారు. “ఇంకా ఏ ముఖం పెట్టుకుని మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరుగుతున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు.

నిజామాబాద్‌కు అవుటర్ రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని, ఇందూరు ప్రజలను మోసం చేస్తే ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘దేవుళ్లను మోసం చేసినోడికి ప్రజలను మోసం చేయడం పెద్ద విషయం కాదు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నగరంలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కావని, ఇప్పటివరకు 25 శాతం పనులు కూడా పూర్తికాలేదని ఆరోపించారు. రూ.162 కోట్ల ప్రాజెక్టుకు కేవలం రూ.10 కోట్ల నిధులు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

అలాగే, ‘2039 వరకు రాహుల్ ప్రధాని కారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అంటే మరో పదేళ్లు దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుందని కాంగ్రెస్ స్వయంగా ఒప్పుకుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) లాంటి జెన్యూన్ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని సూచించారు. బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలో సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించిన అరవింద్ (MP Arvind).. ‘ఉన్న పట్టణాన్ని అప్‌గ్రేడ్ చేస్తానన్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మలేదు.. ఇక లేని ఫ్యూచర్ సిటీని ఎలా నమ్ముతారు’ అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: కేబీఆర్ పార్క్ పరిధిలో చెట్లు నరకొద్దు.. సుప్రీంకోర్టు ఆదేశం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>