Mobile Popup Ad
Mobile Popup Ad

బండి సంజ‌య్ రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ ధ‌ర్నా

క‌లం, వెబ్‌డెస్క్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో బీఆర్ఎస్ (Karimnagar BRS) శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో భారీ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల చేతుల్లోంచి ఫ్లెక్సీని బలవంతంగా లాక్కున్నారు. దీంతో పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బండి సంజయ్ కేంద్ర‌ మంత్రిగా ఉంటే మైనర్ బాలికకు న్యాయం జరగ‌దు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రధాని మోదీ బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>