మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. 10 పర్సెంట్ మినిస్టర్ ఎవరు?

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని, కనీసం ఒక్క మంత్రిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఒక మంత్రి అయితే ఏకంగా 10 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారనే చర్చ బహిరంగంగా సాగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అవినీతి అక్రమాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందని మోత్కుపల్లి హెచ్చరించారు.

ఎస్సీ, బీస్సీ, ఓసీ ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి కదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు (CM Revanth Reddy) ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోత్కుపల్లి (Motkupalli Narasimhulu) వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

Read Also: మహిళా బిల్లును వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవు: మోదీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>