కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్య భర్తల మధ్య మాత్రేమే ఉండవలసిన ఆ బంధాన్ని మరొకరితో పంచుకొని విచ్చలవిడిగా ప్రవర్తించే మనుషులు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. భార్య / భర్త ఇంట్లో లేని సమయంలో గుట్టుచప్పుడూ కాకుండా ఎఫైర్ నడిపించే ఘటనకు కోకొల్లలు. తీరా కొద్దీ రోజులకే లేదా నెలలు, సంవత్సరాలు గడిచాక ఎప్పుడో ఒకప్పుడు వీరి విషయం బయటపడాల్సిందే. ఇలా భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తమకు ఇష్టం వచ్చినవారితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. చివరికి ప్రియుడికోసం కట్టుకున్నవాడిని కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు. తమ వివాహేతర బంధానికి ఎలాంటి అడ్డు ఉండకూడదని.. భార్య/ భర్తను చంపిస్తే ఇక ఏ గొడవ ఉండదు అనుకోని అన్నంత పని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటనలు రోజుకి ఎక్కడో ఒకచోట జరుగుతోనే ఉన్నాయి.
పెళ్లి కానీ వారు ప్రేమించి పెళ్లి చేసుకునే ఘటనలు సమర్థించగలిగినవే అయినా.. ఇలా వివాహేతర సంబంధాలు మాత్రం కుటుంబంలో చిచ్చురేపుతున్నాయి. భార్యభర్తలు అన్యోన్యంగా కలిసి తమ జీవితాన్ని సాగించుకోవాలనే సంతోషం.. ఈ వివాహేతర సంబంధంతో ముక్కలవుతోంది. వీరి పిల్లలు తల్లిదండ్రులను, వారి అనురాగాన్ని కోల్పోయి అనాథలు అవుతున్నారు. పిల్లలు, భర్త ఏమైపోయినా పర్లేదు.. తమ సుఖం తాము చూసుకుందాం అనే మహిళలూ ఇటీవల ఎక్కువయ్యారు. భర్త పని నిమిత్తం బయటికి వెళ్తే.. వేరే మగాడితో ఎఫైర్ నడిపించే ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ (Bihar Extramarital Affair) లో జరిగింది. అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి ఈ విచ్చలవిడి విశృంఖలత్వ ధోరణికి పాల్పడింది.
ఆమెకు 36.. అతనికి 24.. కట్ చేస్తే..
వివరాల్లోకి వెళ్తే.. నలంద జిల్లా కత్వార్‌సల్పూర్‌లో పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్న మహిళ తన భర్తను కాదని.. మరో పురుషుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త లేని సమయంలో అతడితో ఏకాంతంగా గడిపేది. భర్తతో పంచుకోవాల్సిన మధుర స్మృతులను పరపురుషిడితో పంచుకొని వివాహం అనే బంధానికి మాయని మచ్చ తెచ్చింది. ఇలా కొంత కాలంగా గడుతున్న వీరి యవ్వారాన్ని స్థానిక గ్రామస్తులు గమనించారు. భర్త లేని సమయంలో వేరే వ్యక్తి సదరు మహిళ ఇంటికి రావడం ఏంటని గుసగుసలు మొదలయ్యాయి. సదరు మహిళ ఇలాంటి వికృత చేష్టకు పాల్పడుతుందని గ్రహించి అక్కడివారంతా ఏకమై వీరికి బుద్ధి చెప్పాలనుకున్నారు. భర్త లేని సమయంలో మహిళ ఇంటికి వెళ్లిన సదరు యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిద్దరూ చేసే బాగోతాన్ని గ్రామస్తులు బట్టబయలు చేశారు. పెళ్ళై.. ముగ్గురు పిల్లలు ఉండి కూడా నీకు ఇదేం పోయేకాలం, భర్త పిల్లల గురించి ఆలోచించావా? అంటూ మహిళపై మండిపడ్డారు.
అయితే సదరు మహిళకు 36 ఏళ్ళు ఉండగా.. 24 ఏళ్ళ యువకుడితో ఎఫైర్ పెట్టుకున్నట్లు గ్రామస్తులకు తెలియడంతో షాక్ కు గురయ్యారు. తనకంటే 12 ఏళ్ల చిన్నోడైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆశ్ఛర్యానికి గురయ్యారు. తన భార్య ఎఫైర్ గురించి ఖంగుతిన్న భర్త.. ఆమెతో బంధం కొనసాగించలేనని తేల్చి చెప్పారు. సదరు మహిళాను సైతం గ్రామస్తులు ప్రశ్నించడంతో తనకు భర్త వద్దు.. ప్రియుడే కావాలి, అతడినే జీవితాంతం ఉంటాను అని చెప్పడంతో ఇక చేసేదేం లేక వారిద్దరికీ అక్కడికక్కడే పూల దండలు మార్పించి పెళ్లి చేయించారు.
ఎఫైర్ పూర్తిగా తప్పు!
అయితే గ్రామస్తులు సదరు మహిళకు పెళ్లి చేయడంపై భిన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కట్టుకున్న వాడితో ఉండటం కంటే.. ప్రేమించిన ప్రియుడితోనే ఉండటం మంచిదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మహిళ, పురుషుడికి పెళ్ళైతే వారు భార్య భర్తలుగా మారి వివాహ బంధంలోకి అడుగుపెడతారని.. వారి కోరికలు బంధాలు ఆప్యాయతలు, అనురాగాలు, కోపాలు, ద్వేషాలు వారిద్దరి మధ్యే ఉండాలని మధ్యలో మరో వ్యక్తికి ఆస్కారం ఇవ్వొద్దని చెబుతున్నారు. పెళ్ళైన తరువాత భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి తప్ప ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేయకూడదని.. ఇది పూర్తిగా తప్పు అని భావిస్తున్నారు. పెళ్ళై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారి మనస్సు కకావికలమే కాకుండా బాధతో సూసైడ్ చేసుకునే అవకాశం ఉందని.. పవిత్ర బంధం ముక్కలవుతుందని చెబుతున్నారు. ఇక వీరికి పుట్టిన సంతానం తల్లిదండ్రులకు దూరం అవడంతో అనాథలుగా మారుతారని.. తల్లిదండ్రుల పెంపకం లేకపోతే నేరస్తులుగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సమాజానికి ఏ మాత్రం మంచి చేయని ఇలాంటి వివాహేతర సంబంధాలు కుటుంబ విలువలను పూర్తిగా దిగజారుస్తాయని అభిప్రాయపడుతున్నారు.

