Mobile Popup Ad
Mobile Popup Ad

దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి తల్లి సూసైడ్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చంపిన తరువాత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో స్రవంతి అనే మహిళ ఇద్దరు కొడుకులకు ఉరి వేసి అనంతరం తాను సూసైడ్ చేసుకుంది. కొద్ది రోజులుగా భర్త ప్రవీణ్ తో మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో స్రవంతి పెద్దల సమక్షంలో మాట్లాడేందుకు వెళ్లింది. అయితే, అప్పటికే భర్త ప్రవీణ్ వేరే వివాహం చేసుకున్నాడని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి భర్త ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>