సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్

కలం, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్‌తో  ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. దీనితో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)  డైరక్షన్‌లో ఓ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి ఒకే చెప్పాడు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. “SVC 63” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నయనతార ఆ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సల్మాన్ సరసన నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్, టాలీవుడ్ మేళవింపుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>