పూడూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం!

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ (Vikarabad) జిల్లా పూడూరు (Pudur) మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య (Suicide) కు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. మండలంలోని మాటుగూడ గ్రామానికి చెందిన మమత (30) కుటుంబ కలహాల కారణంగా భర్త రాజుతో గొడవ పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. తన ఇద్దరు పిల్లలైన కూతురు జనశ్రీ(8), కొడుకు సాకేత్(4)లను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్​లిపోయింది. అనంతరం సోమనుర్తి శివారులోని ఒక వ్యవసాయ బావిలో పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది.

శనివారం ఉదయం సోమనుర్తి శివారులోని సదరు వ్యవసాయ బావి వద్ద చెప్పులు, బ్యాగు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని బావిలో గాలింపు చర్యలు చేపట్టగా.. మమత, జనశ్రీల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం చిన్నారి సాకేత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>