వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బోల్తా పడిన బస్సు!

కలం, మెదక్ బ్యూరో : వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం (Ananthagiri Bus Accident) చోటుచేసుకుంది. అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని క్యాసారం గ్రామస్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గ్రామస్తులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడి నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

నిన్న ఇస్నాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న వెల్డర్ నారాయణరెడ్డి (55) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరంతా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అనంతగిరి గుట్టల ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రమీల (52), యాదమ్మ (52), మాల పద్మ (50), పద్మమ్మ (55)గా గుర్తించారు.

ప్రమాద ధాటికి బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వైద్యం కోసం పలు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో క్యాసారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>