ట్రిప్‌‌కు వెళ్లిన హీరోయిన్‌‌కు ప్రమాదం.. విరిగిన వెన్నెముక!

కలం, సినిమా : ప్రముఖ బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా (Nushrratt Bharuccha) ప్రమాదానికి గురయ్యారు. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లిన ఆమె, అక్కడ అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే నుష్రత్ భరూచాను బాలిలోని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తీసుకొచ్చారు.

ముంబై విమానాశ్రయం నుంచి ఆమెను నేరుగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నుష్రత్‌కు త్వరలోనే వెన్నెముక శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం అందుతోంది. నుష్రత్ భరూచా ప్రమాదానికి సంబంధించిన వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. అయితే నుష్రత్ భరూచాకి ఎలా ప్రమాదం జరిగింది అనే వివరాలను ఆమె టీమ్ ఇంకా వెల్లడించలేదు.

నుష్రత్ భరూచా సినీ కెరీర్

నుష్రత్ భరూచా 2010లో నటుడు శివాజీ సరసన వచ్చిన ‘తాజ్ మహల్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించిన ఆమె, ‘ప్యార్ కా పుంచ్‌నామా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’ , ‘రామ్ సేతు’ వంటి బ్లాక్‌బస్టర్ హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లోనూ నుష్రత్ భరూచా హీరోయిన్‌గా అలరించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>