నిజామాబాద్‌లో చిరుత సంచారం.. అధికారుల సూచనలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మోపాల్ మండలం మోతీ రామ్ నాయక్ తండా నుంచి కాల్పోల్ వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. రాత్రి సమయాల్లో కొందరు కాల్పోల్ వెళ్తుండగా చిరుత కనిపించింది. ఆ మార్గంలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

మరోవైపు ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత(Leopard) సంచారం నేపథ్యంలో అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జనాలు ఒంటరిగా వెళ్ళకూడదని గుంపులు గుంపులుగా వెళ్ళాలని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>