Mobile Popup Ad
Mobile Popup Ad

వర్ని మండలంలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని మండలంలో తల్లి, కూతుళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన తల్లి మంగలి కల్పన(27) తో పాటు ఇద్దరు కుమార్తెలు అక్షర (4), శ్రీ విద్య (2) అదృశ్యం అయ్యారు. ఈ నెల 22 తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదని, పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదని భర్త మంగలి లచ్చయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>