కలం మెదక్ బ్యూరో: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా (Sangareddy)లో మంగళవారం విషాదం నెలకొంది. కంగ్టి మండలం బొర్గి తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి బావి దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తులో బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. మృతులు తల్లి సావిత్రి బాయి, కూతుర్లు నికిత (13), నందిని (12)గా గుర్తించారు. బావి వద్ద బట్టలు ఉతికే క్రమంలో ఒకరు ప్రమాదవశత్తూ బావిలో జారిపడటంతో.. వారిని కాపాడబోయే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది. స్థానికులు బావి నుండి మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు చనిపోవడంతో కుటుంబసభ్యులు, తండాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

