Mobile Popup Ad
Mobile Popup Ad

అతను అసభ్యకరంగా తాకేవాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : కుంభమేళాలో పూసలమ్మి ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది మోనాలిసా(Monalisa). ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గానే మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ ను లవ్ మ్యారేజీ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయనతో తన మొదటి సినిమా సమయంలో చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారని చెప్పింది. తనను ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తాకేవాడని.. చాలా ఇబ్బంది పెట్టాడని మోనాలిసా (Monalisa) ఆరోపించింది.

ఆ విషయం తన పేరెంట్స్ కు చెబితే.. మొదటి సినిమా కాబట్టి సర్దుకుపోవాలని చెప్పారంటూ మోనాలిసా సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు తన వయసు 18 ఏళ్లు కూడా లేవని.. అందుకే ఆ విషయంపై అప్పుడే బయటకు వచ్చి మాట్లాడలేకపోయానంటూ మోనాలిసా తెలిపింది. తన భర్తతో తమ రాష్ట్రానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నామని.. అందుకే కేరళలోనే ఉండిపోయామంటూ మోనాలిసా వెల్లడించింది. తమకు ప్రాణహాని ఉందని.. ఈ విషయంప పోలీసులకు త్వరలోనే ఫిర్యాదు చేస్తామని మోనాలిసా స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>