కలం, జనగామ: మొబైల్ ఫోన్ల రికవరీకి జనగాం (Jangaon) పోలీసులు చర్యలు చేపట్టారు. డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 82 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను వినియోగించి, మొబైల్ ఫోన్లను ట్రేస్ చేశారు. ACP కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ మీటింగ్ సందర్భంగా డీసీపీ స్వయంగా బాధితులకు వారి ఫోన్లను అందజేశారు.
ఈ సందర్భంగా డీసీపీ రాజమహేందర్ నాయక్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే ప్రజలు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నియమించిన CEIR ఇన్‌చార్జ్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చన్నారు. భవిష్యత్తులో నేరాల నియంత్రణలో సాంకేతికతను జోడించి ప్రజలకు రక్షణగా ఉంటామని డీసీపీ పేర్కొన్నారు.

