కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ (Farmhouse Case) కేసులో కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. సోమవారం రోజు తీర్పు ప్రకటించనున్నట్లు ఉపర్పల్లి కోర్టు తెలిపింది. ఈరోజు, రేపు కోర్టు సెలవు కావటంతో సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది.
డ్రగ్స్‌ముఠాలతో మాజీ ఎమ్మెల్యేకి సంబంధాలపై ఆరాతీస్తోంది. రెండోరోజు నలుగురు నిందితులని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సిట్ సభ్యుడు, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ (DCP Yogesh Gautam) పర్యవేక్షణలో సోమవారం ఏడుగురిని, మంగళవారం నలుగురిని సుధీర్ఘంగా విచారించారు. బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్‌రవి, పుప్పాలగూడకు చెందిన వ్యాపారి అర్జున్‌రెడ్డి, వరమాచినేని శ్రవణ్‌కుమార్, సిలివేరి శరత్‌ని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించిన సంగతి తెలిసిందే.
Read Also: కంటి ముందు నల్లటి చుక్కలు కనిపిస్తున్నాయా..? నిపుణుల హెచ్చరిక !
Follow Us On: X(Twitter)

