కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case)లో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత శర్మను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు నిందితులను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో మార్చి 14న జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడులు చేసి డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితులను కస్టడీకి కోరగా కోర్టు అనుమతించింది. నిందితులను విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ నెట్ వర్క్‌తో పాటు, పట్టుబడ్డ రోజు జరిగిన కాల్పుల గురించి విచారించనున్నారు.
Read Also: హర్మూజ్‌కు నో ఆల్టర్నేట్
Follow Us On: X(Twitter)

