Mobile Popup Ad
Mobile Popup Ad

మాఫియా పాలన నుంచి విముక్తి కల్పిస్తాం: బెంగాల్‌లో ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో (West Bengal) మాఫియా పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (Modi)  వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ప్రజలు బీజేపీ సభలకు భారీగా తరలివస్తున్నారని.. జనం మార్పును కోరుకుంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. రాక్షసపాలనకు, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో హాల్దియాలో జరిగిన బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. జనం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తన సభకు భారీగా తరలిరావడం మార్పునకు సంకేతమన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని వెనక్కి లాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికం పోలేదని.. అభివృద్ధి జరగడం లేదని.. బుజ్జగింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

క్రూరమైన ప్రభుత్వాన్ని సాగనంపుదాం

ఆసన్సోల్‌లో జరిగిన మరో సభలో ప్రధాని మోదీ (Modi) మాట్లాడుతూ.. టీఎంసీ ప్రభుత్వాన్ని “క్రూరమైన ప్రభుత్వం”గా అభివర్ణించారు. మాఫియా పాలన నుంచి విముక్తి కల్పించి, ఆసన్సోల్ పారిశ్రామిక శక్తిని పునరుద్ధరించేశక్తి ఎన్డీయేకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ (BJP), టీఎంసీ (TMC) మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగుతోంది. సర్ ప్రక్రియను అడ్డుపెట్టుకొని తమకు అనుకూలంగా ఉండే ఓట్లను తొలగిస్తున్నారని టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ మరోసారి కచ్చితంగా గెలుస్తుందని ఆమె అత్యంత విశ్వాసంతో ఉన్నారు. ఇక గ్రామీణప్రాంతాల్లో టీఎంసీ బలంగా ఉందని స్థానిక మీడియా సంస్థలు, సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ప్రధాని ఈ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. బెంగాల్‌లో చొరబాటుదారులు పెరిగిపోయాయరని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also: బీ అలర్ట్.. హెల్మెట్ లేకపోతే ఇక లైసెన్స్‌ కట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>