బట్టలు ఇస్త్రీ చేసే వ్యక్తికి వందల కోట్లు.. ఏంటి ఘోరం..!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడలో సెలూన్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తికి ఇటీవల రూ. 75 లక్షల పన్ను నోటీసులు రావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సెలూన్ షాపు నిర్వహిస్తున్న తనకు విశాఖలో ఐరాన్ స్క్రాప్ వ్యాపారం ఉన్నట్లు రికార్డులు చూపించిన.. తనకు నోటీసులు ఇచ్చారని సదరు బాధితుడు లబోదిబోమన్నాడు. అయితే ఈ ఘటన మరవకముందే .. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ (Ajmer) లో బట్టలు ఇస్ట్రీ చేస్తున్న వ్యక్తికి కూడా అక్షరాలా రూ. 598 కోట్లు కట్టాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..?

అజ్మీర్ (Ajmer) లోని రామ్ నగర్ నివాసి అయిన జితేంద్ర కుమార్ బడోలియా బట్టలు ఇస్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయన పేరు మీద వందల కోట్ల రూపాయాల లావాదేవీలు జరిగాయని.. జితేంద్ర కుమార్ ఏకంగా రూ. 598,50,27,726 (సుమారు 598 కోట్లు) పన్ను బకాయి ఉన్నట్లు అదాయపు పన్ను శాక నోటీసులు జారీ చేసింది. దీంతో జితేంద్ర కుమార్ వెంటనే న్యాయవాదితో కలిసి ఐటీ కార్యాలయానికి వెళ్లి తన దుస్థితిని వివరించాడు. తనకు రోజుకు రూ. 500 మంచి రూ.700 ఆదాయం రాదని , ఇంత భారీ మొత్తంలో తాను ఎలా లావాదేవీలు చేయగల్గుతానని ఆవేదన చెందాడు.

ఐటీ నోటీసులపై క్లారిటీ

అయితే ఐటీ కార్యాలయం అధికారులు విచారణ ప్రారంభించగా అసలు నిజం బయటకు వచ్చింది. కొన్ని ఏళ్​ల క్రీత జితేంద్ర తన పాన్ కార్డును పొగొట్టుకున్నారని.. అదే తన పాలిట శాపంగా మారిందని తేల్చారు. పాలీకి చెందిన శత్రుఘ్న సింగ్ అనే వ్యక్తి జితేంద్ర పాన్ కార్డును చేజిక్కుంచుకుని.. దాంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొంది ఓ బ్యాంకు ఖాతాను తెరిచినట్లు కనుగొన్నారు. ఈ ఖాతా ద్వారానే కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు, అభరణాల క్రయవిక్రయాలు జరిగినట్లు నిర్ధారించారు. దీంతో అసలు దోషిని పట్టుకునే పనిలో అధికారులున్నారు. కాగా, ఈ ఘటనపై జితేంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

చదువు రాని వాళ్లే టార్గెట్..!

పలువురు సామాన్యులకు ఇటీవల పన్ను నోటీసులు రావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పూట గడవని పేదల ఇళ్లకు ఐటీ నోటీసులు రావడం ఏంటి? అని ప్రశ్నలు ఉత్పత్తన్నవుతున్నాయి. చదవు రాని వాళ్లే టార్గెట్ గా కేటుగాళ్లు ఈ దందాలకు తెగబడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. చదువురాని వాళ్​ల ఐడి మీద GST నెంబర్లు, బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసి అక్రమాలు చేసి తప్పించుకుంటారని చెబుతున్నారు. ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: బీ అలర్ట్.. హెల్మెట్ లేకపోతే ఇక లైసెన్స్‌ కట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>