కలం, మెదక్ బ్యూరో: 104 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌లకు 14 నెలలుగా జీతాలు అందడం లేదని, తమ జీతాలు అందేలా చూసి ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో పలువురు ఉద్యోగులు మంగళవారం ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy)కి వినతిపత్రం అందజేశారు. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగుల ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని అంజిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. డీఎంఈ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రతి సమస్య పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలను ఖచ్చితంగా సీఎం, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Read Also: మొటిమలు, బ్లాక్ హెడ్స్‌తో విసిగిపోయారా? జామ ఆకులతో ఇలా చేయండి!
Follow Us On: Sharechat

