Mobile Popup Ad
Mobile Popup Ad

సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ బిగ్ అప్డేట్

కలం, సినిమా : మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు'(Sambarala Yeti Gattu). యంగ్ డైరెక్టర్ రోహిత్ కేపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక సమాచారం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చిత్ర బృందం ముంబైలో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ నటుడి పేరు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ఆ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే ఆసక్తి అభిమానులలో నెలకొంది.

ముఖ్యంగా ముంబై షెడ్యూల్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్ సినిమా కథలో అత్యంత కీలకంగా నిలవనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  అందుకే మేకర్స్ ఈ భాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.  గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2026లోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>