ఆందోళన వద్దు.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల కొనుగోలులో ఆలస్యం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల (Jagtial) జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. ధర్మపురి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చిందని ఆన్‌లైన్‌లో ట్రక్ షీట్‌తో పాటు ధాన్యం తరలిస్తున్న వాహనాలకు జీపీఆర్ఎస్ (GPRS) వంటి సాంకేతిక సమస్యలతో కొనుగోలు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు.

కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిబంధనలను సడలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయడంతో కొనుగోలు ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. వారం పది రోజుల్లో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన పడొద్దని, ధర్నాలు, రాస్తారోకోలకు దిగవద్దని రైతులు కోరారు. పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి (Minister Adluri) ఈ సందర్భంగా సూచించారు.

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని మంత్రి సూచించారు. రైతులకు ఉన్న సమస్యలు తన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజు, సౌళ్ల నరేష్, చీపురుశెట్టి రాజేష్ తదితరులు ఉన్నారు.

Read Also: 9న బెంగాల్‌ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం: ఆ కీలక నేత ఎవరు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>