ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారుల నిర్బంధం

కలం, ఖమ్మం బ్యూరో:  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, బూర్గంపాడు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. వ్యవసాయాధికారులను రైతులు నిర్బంధించడం కలకలం రేపింది. తాము రోజులతరబడి ఎదురుచూస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. రైతు వేదిక వద్దకు వచ్చిన అగ్రికల్చర్ అధికారిని, పీఏసీఎస్ అధికారులను గదిలో బంధించారు. నాణ్యత పేరుతో ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. కేంద్రాల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగుతామంటూ హెచ్చరించారు.

Read Also: ఇష్టంలేని గర్భంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>