Mobile Popup Ad
Mobile Popup Ad

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష

కలం, నకిరేకల్ : రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరాయంగా సాగించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) అధికారులను ఆదేశించారు. బుధవారం నకిరేకల్ (Nakrekal) పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, వెంటనే మిల్లులకు తరలించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం కొనుగోలు కేంద్రాల వద్ద తగినంత మంది హమాలీలను, రవాణాకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. “రైస్ మిల్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ధాన్యం లిఫ్టింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలి” అని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు.

Read Also: రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ.. కేసీఆర్‌కు కొత్త చిక్కులు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>