కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ (Balka Suman)పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడుగా చేసిన వ్యక్తి రైలు పట్టాలు కోసేయాలని పిలుపునిచ్చారని.. వెంటనే రైల్వే శాఖ తరుపున కేంద్ర పోలీసులు అతని మీద కేసులు నమోదు చేయాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రభుత్వ నిర్ణయాల మీద విభేదించి పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉందని.. ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి జాతీయ సంపద అయిన రైల్వే పట్టాలు కోసేయాలని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వ్యాఖ్యలు ఆశ్చర్యం అనిపిస్తుందని.. ఒక రాజకీయ ఉన్మాదిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక చెన్నూరు నాయకులను తాను కోరుతున్నానని.. ఆ విడియోతో సహా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
సింగరేణి కార్మికులు తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేసుకోవాలని ఈ ప్రభుత్వం చెబుతోందన్న మంత్రి (Ponnam Prabhakar).. రైతుల ధర్నాకు ఐదుగురు రైతులు రాలేదని పార్టీ నేతలతో కలిసి ధర్నా చేసినట్టు స్వయంగా ఆయనే చెప్పారని విమర్శించారు. “నెల రోజులు జైలుకు పోయిన పర్వాలేదు.. రైలు పట్టాలు కోసేయి..సింగరేణి భవనాన్ని కాల్చేయి” అని అంటున్నారని.. వెంటనే అతడిని పార్టీ నుండి బీఆర్ఎస్ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము ఎప్పుడైనా విధ్వంసాలు రెచ్చగొట్టేలా రైలు పట్టాలు కోసేయాలని చెప్పామా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు విఘాతం కలిగేలా చేయడం సరైంది కాదని.. వారి నాయకత్వం చూస్తూ ఊరుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్‌గా భావిస్తామని అన్నారు.
Read Also: రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ.. కేసీఆర్‌కు కొత్త చిక్కులు!
Follow Us On : WhatsApp

