చిన్నారెడ్డికి కీలక బాధ్యతలు.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి హర్షం

కలం, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని చైర్మన్‌గా నియమించింది. చిన్నారెడ్డికి కీలక బాధ్యతలు నిర్వహించినందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ లాంటి కీలక రంగాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించడం, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం ద్వారా రైతుల్లో అవగాహన ఏర్పడుతుందన్నారు. జి. చిన్నారెడ్డి అనుభవం, పరిపాలనా దక్షత రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>