షాదాబ్ హోట‌ల్ సీజ్‌.. FSSAI లైసెన్స్ స‌స్పెండ్‌!

క‌లం, వెబ్‌డెస్క్: హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ హోట‌ల్ షాదాబ్‌ (Shadab Hotel)కు టీజీ సేఫ్ అధికారులు షాకిచ్చారు. ఆ హోట‌ల్‌కు చెందిన మ‌దీనా స‌ర్కిల్ బ్రాంచ్‌ను సీజ్ చేశారు. అలాగే ఆ బ్రాంచ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ను కూడా ర‌ద్దు చేశారు. ఆహార భ‌ద్ర‌తా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న కార‌ణంతో అధికారులు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.

తాజాగా టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు ప‌లు హోట‌ళ్ల‌ను త‌నిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో భాగంగా షాదాబ్ హోట‌ల్‌(Shadab Hotel)లో ఆహార భ‌ద్ర‌త ఉల్లంఘ‌న‌లు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ముఖ్యంగా మాంసం, ఇత‌ర ఆహార ప‌దార్థాల నిల్వ‌, నిర్వ‌హ‌ణ‌లో భారీగా లోపాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో చ‌ర్య‌లు తీసుకుంటూ యాజ‌మాన్యానికి కీల‌క సూచ‌న‌లు చేశారు. భ‌ద్ర‌తా లోపాలు స‌రిదిద్దుకునేందుకు వారం రోజుల గ‌డువు ఇచ్చారు. యాజ‌మాన్యం త‌గిన చ‌ర్య‌లు తీసుకొని రీ ఇన్ స్పెక్ట్ చేయాల‌ని కోరితే, అధికారుల సంతృప్తి మేర‌కు లైసెన్స్ పున‌రుద్ధ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక వేళ గ‌డువులోగా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే లైసెన్స్ పూర్తిగా ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన : కీలక సమీక్ష!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>