సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన : కీలక సమీక్ష!

కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మద్దూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను, స్థానిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నేరుగా పరిశీలిస్తున్నారు. అనంతరం దౌల్తాబాద్‌లోని రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

హకీంపేట వద్ద ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనుల స్థితిగతులపై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గం(Kodangal)లోని పలు సంక్షేమ, అభివృద్ధి పనులపై అధికారులకు తగిన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటన ముగించుకుని రాత్రికి ఆయన కొడంగల్‌లోని ఆయన నివాసంలోనే బస చేయనున్నారు.

Also Read : షాదాబ్ హోట‌ల్ సీజ్‌.. FSSAI లైసెన్స్ స‌స్పెండ్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>