కలం, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)మరో మైలు రాయిని అధిగమించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన ఈఓఎస్-05 ఉప గ్రహాన్ని నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ వి.నారాయణ్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా జియో, సబ్ జీటీవో కక్ష్యలోకి పంపిన అత్యంత బరువైన ఉప గ్రహం ఇదేనని మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ తెలిపారు. దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి దేశాన్ని నిరంతరం పర్యవేక్షిచేందుకు, సమీప రియల్ టైం చిత్రాలను అందించేందుకు ఈ ఉప గ్రహం ఉపయోగపడుతుందని వెల్లడించారు.
ఈ విజయంపై సైన్స్ అండ్ టెక్నాలజి మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఎక్స్ వేదికగా ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ జియోసింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ శాటిలైట్ అని, దీని ద్వారా విజిబుల్ ఇన్ఫ్రారెడ్, మల్టీ స్పెక్ట్రల్, హైపర్ స్ప్రెక్టల్ శ్రేణుల్లో అధిగమించిన ఇమేజింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాదిలోనే మానవ రహిత గగన్‌యాన్ ప్రయోగంతో పాటు, ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉప గ్రహం సహా మరో ఆరు ప్రయోగాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Also Read : సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన : కీలక సమీక్ష!
Follow Us On: X(Twitter)

