వనపర్తి టౌన్‌హాల్‌ పనులపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోకస్‌

కలం, వనపర్తి : వనపర్తి (Wanaparthy) పట్టణంలోని పాత మార్కెట్‌ యార్డు (గంజి)లో నిర్మిస్తున్న టౌన్‌హాల్‌ (Town Hall)  పనులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) గురువారం పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.3.75 కోట్ల నిధులు విడుదల చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

టౌన్‌హాల్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే నెల 15వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు గుత్తేదారు తిరుపతయ్య సాగర్‌ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి రమేష్‌, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌, పట్టణ  కాంగ్రెస్‌ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>