ఇళ్లపై నుంచి 11కేవీ వైర్లు వేయొద్దు.. కుమ్మరోనీ పల్లె గ్రామస్తుల డిమాండ్

కలం, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ మండలంలోని కుమ్మరోనీ పల్లె (Kummaronipally) ప్రధాన రహదారిపై ఉన్న ఇండ్ల ముందు నుంచి 11 కేవీ విద్యుత్ వైర్లలను వేయొద్దని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక ఏఈ అదే విధంగా డీఈ లకు వరుసగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

11 కేవీ విద్యుత్ తీగలు చాలా ప్రమాదకరమని తెలిసి కూడా గ్రామం వెలుపలి భాగం నుంచి వేయకుండా కావాలని గ్రామం నడిబొడ్డు నుంచి వేయడం ప్రమాదకరమని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన విద్యుత్ డీఈ ఉండటం వల్లనే ఇలా జరుగుతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై జిల్లా కలెక్టర్ రంగంలోని దిగి సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారానికి మార్గం చూపాలని కుమ్మరోనీ పల్లి ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>