నియోజకవర్గాల పెంపుపై ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలపై ఖర్గే ఈ లేఖ రాశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను ఈ లేఖ రాసినట్లు ఖర్గే లేఖలో పేర్కొన్నారు. డీలిమిటేషన్ ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. బలవంతంగా బిల్లును తీసుకురావొద్దని ఖర్గే కోరారు. ప్రస్తుతం లోక్ సభ స్థానాలను 25 సంవత్సరాల వరకు కొనసాగించాలని పేర్కొన్నారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, మహిళలకు మూడోవంతు స్థానాలు కేటాయించాలని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>