కోర్టు కాంప్లెక్స్ పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

కలం, వనపర్తి : జిల్లా కేంద్రంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ (Wanaparthy Court Complex ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) నిర్మాణ పనులను పరిశీలించి, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంప్లెక్స్‌లో 12 రకాల కోర్టులకు అవసరమైన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మొదటి, రెండో అంతస్తుల స్లాబ్ పనులు పూర్తికాగా, మరో అంతస్తు స్లాబ్ పనులు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో కొన్ని కారణాల వల్ల స్వల్ప జాప్యం జరిగిందన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కాంప్లెక్స్‌ను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

ఈ కాంప్లెక్స్ (Wanaparthy Court Complex) అందుబాటులోకి వస్తే న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలకు ఒకే ప్రాంగణంలో మెరుగైన న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థకు ఆధునిక వసతులు కల్పించడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఎస్‌ఈ, ఈఈ, ఇతర అధికారులు, మున్సిపల్ చైర్మన్ మాధవి ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Also Read : నలుగురు ప్లేయర్లు స్వాప్‌.. ఐపీఎల్‌లో భారీ మార్పు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>