కలం, వెబ్‌డెస్క్: ఏపీలో సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైన కోడిపందేలు (Cockfighting Racket) ఇప్పుడు రాష్ట్రాన్ని దాటి ఉత్తరాదికి విస్తరిస్తున్నాయి. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh-Telangana) సరిద్దుల్లో జాతరను తలపించేలా జరుగుతున్న భారీ కోడిపందేలు వెలుగులోకి వచ్చాయి. బీజాపూర్ అడవీ ప్రాంతంలో ప్రతి రోజు కోడి పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు ముఠాలుగా మారి టెంట్లు వేసి బెట్టింగ్స్ చేస్తూ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఛత్తీస్‌గఢ్ పోలీసులు కోడి పందేలు జరుగుతుండగానే దాడులు నిర్వహించారు.
ఈ వ్యవహారంలో మొత్తం 156 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ.20.01 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 47 కార్లు, 12 ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పందేల వెనుక ఉన్నది ఒక్య వక్తి మాత్రమేనా? లేక కొందరు సిండికేట్‌గా మారి పందేలు చేస్తున్నారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.

